కిరణ్ అబ్బవరం అప్పుడే ఆ శుభవార్త

గత ఏడాది కిరణ్ అబ్బవరం జీవితంలో రెండు హిట్లు కొట్టాడు. తనతో కలిసి రాజావారు-రాణీవారు సినిమా (2019)లో నటించిన హీరోయిన్‌ రహస్యని ప్రేమించి, ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతో గత ఏడాది ఆగస్ట్‌లో పెళ్ళి చేసుకున్నాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా గత ఏడాది అక్టోబర్‌లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కనుక కిరణ్ అబ్బవరం జీవితంలో 2024 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

ఈ ఏడాది కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ ఏడాది కూడా కిరణ్ అబ్బవరంకు శుభారంభమే అయ్యింది. తాను తండ్రిని కాబోతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

“మా ప్రేమ పెరుగుతోంది” అంటూ భార్య రహస్యతో దిగిన ఫోటోని సోషల్ మీడియా పెట్టాడు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని కోరుతూ కిరణ్ అబ్బవరం పెట్టిన పోస్టుపై పలువురు స్పందిస్తూ ఆ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

‘క’ తర్వాత విశ్వకరుణ్ దర్శకత్వంలో ‘దిల్‌రుబా’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకి జోడీగా రుక్సర్ ధిల్లాన్ నటిస్తోంది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 

‘దిల్‌రుబా’కి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్ , సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.   

శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.