కలెక్షన్స్‌ గొప్పలు: ఐటి దాడులు!

డిసెంబర్‌ 5 న విడుదలైన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,900 కోట్లు కలెక్షన్స్‌ సాధించిందని మైత్రీ మూవీ మేకర్స్ గొప్పగా చెప్పుకుంది. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్‌ సినిమాలు బాగా ఆడుతున్నాయని, వాటిలో 'సంక్రాంతికి వస్తున్నాం' కలెక్షన్స్‌ బ్రహ్మాండంగా ఉన్నాయని నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, దర్శకుడు అనిల్‌ రావిపూడి స్వయంగా చెప్పుకున్నారు. ఆదాయపన్ను శాఖ దాడులు చేయడానికి ఇంతకంటే ఏం సమాచారం కావాలి?

అందుకే మంగళవారం ఉదయం నుంచిఒకేసారి దిల్‌రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, వాటి అధినేతలు, వారి భాగస్వాముల ఇళ్ళు, కార్యాలయాలలో దాడులు చేస్తున్నారు. మ్యాంగో మీడియా అధినేత రాము, వారి కార్యాలయంలో  కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి.

ఇళ్ళలో మంగళవారం ఉదయం నుంచి ఒకేసారి 55 బృందాలు హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్, గచ్చిబౌలి తదితర 8 ప్రాంతాలలో వారి ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.