ఈసారి కొరియన్ హర్రర్ కామెడీ ట్రై చేస్తున్నా: వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ 15వ సినిమా ప్రకటన వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ హర్రర్-కామెడీ సినిమా చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై నిర్మించబోతున్న ఈ సినిమాకి ధమన్‌ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా భిన్నంగా ఉంది. ‘కదిరి నరసింహ సామి శాచచ్చిగా ఈ తూరీ నవ్వించేకి వస్తుండా,’ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, పనిచేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు మేర్లపాక గాంధీ భవన్‌లో చెప్పారు.