
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా చేస్తున్న ‘రాబిన్‌హుడ్’ గత నెల 25న క్రిస్మస్ పండుగకు విడుదల కావలసి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
పుష్ప-2, గేమ్ చేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం నాలుగు పెద్ద సినిమాల మద్య రాబిన్‌హుడ్ నలిగిపోతాడని భావించి నిర్మాతలు సినిమా వాయిదా వేసుకోవడం చాలా మంచి నిర్ణయమే అని చెప్పొచ్చు. ఇప్పుడు మార్చి 28కి రాబిన్‌హుడ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ చేసిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ చాలా సమయం తీసుకోవడంతో ఇంతకాలం ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు మార్చి 28న విడుదలవుతోంది.
భారీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ విషయం తెలిసే మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్‌హుడ్‌ని మార్చి 28న దింపుతోంది. అంటే హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడబోతోందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వాయిదా పడకపోతే ఆ రెండు సినిమాల మద్య గట్టి పోటీ ఏర్పడుతుంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ పాన్ ఇండియా మూవీగా రాబిన్ హుడ్ నిర్మిస్తున్నారు.
This summer, buckle up for the ADVENTUROUS ENTERTAINER that is going to erupt on the big screens 💥💥#Robinhood IN CINEMAS WORLDWIDE ON MARCH 28th ❤🔥@actor_nithiin @VenkyKudumula @gvprakash @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/icSncCPX0Y
— Sreeleela (@sreeleela14) January 18, 2025