అమెజాన్ ప్రైమ్‌లో విడుదల-2

కోలీవుడ్‌ దర్శకుడు వేతరిమారం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు చేసిన విడుదల-2 సినిమా ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. ‘విడుదల’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా విడుదల-2 తీశారు.

కానీ మొదటి భాగం అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. విడుదల మొదటి భాగం ఇదివరకే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యింది. ఇంకా ఉంది కూడా. ఇప్పుడు రెండో భాగం కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోంది. 

క్లుప్తంగా కధ ఏమిటంటే, ఉపాధ్యాయుడుగా జీవనం సాగిస్తున్న పెరుమాళ్ అలియాస్ మాస్టర్ (విజయ్ సేతుపతి) జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే ప్రజాడలం నాయకుడుగా మారుతాడు. పోలీసులు అతనిపై ‘నక్సల్’ ముద్ర వేసి పట్టుకోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. అక్కడి నుంచి రెండో భాగం మొదలవుతుంది. అదెలా ఉందో అమెజాన్ ప్రైమ్‌లో చూసి తెలుసుకుంటే బాగుంటుంది.