కన్నప్పకి మహాశివుడికి దర్శనం జనవరి 20న

ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో శివపార్వతులుగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పార్వతీదేవి రూపంలో కాజల్ అగర్వాల్ పోస్టర్ రిలీజ్‌ చేసిన చిత్రబృందం ఈ నెల 20న శివుడి దర్శనం చేయించబోతున్నామని తెలియజేశారు. 

స్టార్ ప్లస్ టీవీలో సూపర్ డూపర్ హిట్ అయిన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, దేశంలో అగ్రనటీనటులు ఈ సినిమాలో నటిస్తుండటంతో కన్నప్పపై చాలా భారీ ఆంచనాలే ఉన్నాయి. ఆ నమ్మకంతోనే కన్నప్పని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 

కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడి పాత్ర లో కనిపిస్తారని ముందు అనుకున్నప్పటికీ ఆయన నందీశ్వరుది పాత్ర ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఖ్యపాత్రలు సినిమాలో మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ తదితరుల పోస్టర్స్ విడుదల చేసినప్పటికీ ప్రభాస్‌ పోస్టర్ విడుదల చేయకుండా దాచి ఉంచారు. 

ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న చేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న విడుదలకాబోతోంది.