మన లైలాని చూశారా?

విశ్వక్ సేన్‌ తొలిసారిగా అందమైన అమ్మాయిగా నటిస్తున్న లైలా సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. అయితే టీజర్‌లో లైలా పాత్ర కంటే రెండో పాత్రలో విశ్వక్‌ సేన్‌ హీరోగా విరగదీసుడే టీజర్‌లో ఎక్కువసేపు చూపారు. అలా కూడా విశ్వక్‌ సేన్‌ తన స్టయిల్లో విరగదీశాడు.   

రామ్ నారాయణ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ నటిస్తోంది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున ‘లైలా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్, ఆర్ట్: భామ కడలి చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.