అజిత్ పట్టుదల ట్రైలర్‌ నేడే విడుదల

కోలీవుడ్‌లో యాక్షన్ మూవీస్‌ చేసేవారిలో అజిత్ కూడా ఒకరు. ఆయన 67వ సినిమా ‘విడాముయార్చి’ని ‘పట్టుదల’ అనే టైటిల్‌తో తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కోలీవుడ్‌ దర్శకుడు మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అజిత్‌కు జంటగా త్రిష నటించారు. గురువారం సాయంత్రం 6.40 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌, వచ్చే నెల 6న సినిమా విడుదల కాబోతోంది.  

ఈ సినిమాలో అర్జున్, ససర్జా, రెజీనా కాసండ్ర, ఆరవ్, నిఖిల్ నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి సంగీతం” అనిరుధ్ రవిచందర్, కెమెరా: ఓం ప్రకాష్, ఎడిటింగ్: ఎన్‌బీ శ్రీకాంత్ చేస్తున్నారు.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుబాస్కరన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/upA4QCsrAKE?si=9yRqrD3YJfN5NnUk" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>