లోకల్ చానల్, ట్రావెల్స్ బస్సులలో గేమ్ చేంజర్‌!

సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్‌ సినిమాకు ఊహించని కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు నెగెటివ్ రిపోర్ట్స్ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతుండగా, మరోపక్క అప్పుడే ఈ సినిమాని ఓ లోకల్ టీవీ ఛానల్లో ప్రసారం చేస్తున్నారు. 

సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి ఏపీకి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా గేమ్ చేంజర్‌ సినిమా ప్రదర్శించిన్నట్లు వార్తలు వచ్చాయి.

 ఓ ముఠా గేమ్ చేంజర్‌ నిర్మాతలని తాము అడిగినంతా డబ్బు చెల్లించాలని లేకుంటే ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా విడుదల చేసేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. గేమ్ చేంజర్‌ ఈ నెల 10న విడుదలకాగా అప్పుడే బయటకు లీక్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యజమానులు అందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. 

కనుక గేమ్ చేం గేమ్ చేంజర్‌ సినిమాని ఆన్‌లైన్‌ లీక్ చేయడం వెనుక మొత్తం 45 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు చిత్ర బృందమే సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని చిత్ర బృందం అందించిన సమాచారం, ఫోన్ నంబర్లు, వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.