సంబంధిత వార్తలు

రజినీకాంత్ ప్రధానపాత్రలో సూపర్ డూపర్ హిట్ సినిమా జైలర్‌కి సీక్వెల్‌గా జైలర్-2 తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని ప్రకటిస్తూ ఓ వీడియో (టీజర్) విడుదల చేశారు. అది ట్రైలర్‌కి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది. ‘టైగర్ కా హుకుం.. రీలోడెడ్’ అంటూ విడుదల చేసిన ఇది సినిమా ప్రకటనా లేక రిలీజ్‌కి ముందు విడుదల చేసిన ట్రైలరా?అని అనిపించక మానదు. దీంతో సినిమా అదిరిపోయేలా మొదలుపెట్టారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. భాస్కర భట్ల వ్రాసిన టైగర్ కా హుకుం..’ అంటూ సాగే థీమ్ సాంగ్‌కు అనిరుధ్ రవి చందర్ సంగీతం సమకూర్చారు.