సంక్రాంతికి కొత్త సినిమా పోస్టర్ల కళకళ

ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రాబోయే పలు కొత్త సినిమా పోస్టర్లు విడుదల చేసి సినీ అభిమానులకు కానుకగా అందించాయి ఆయా సినీ నిర్మాణ సంస్థలు. గత ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ సినిమా ‘అఖండ’కి సీక్వెల్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2' తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పోస్టర్ నేడు విడుదల చేశారు. 

బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలలో ఒకటి ‘నారీ నారీ నడుమ మురారి.’ శర్వానంద్ 37వ సినిమాకు ఇదే టైటిల్‌ ఖరారు చేసి ఈరోజు బాలకృష్ణ, రామ్ చరణ్‌ల చేత టైటిల్‌, ఫస్ట్-లుక్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించబోతున్నారు. 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వస్తున్న ‘ది రాజాసాబ్’ తరపున ప్రభాస్‌ పోస్టర్ విడుదల చేశారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ సినిమా నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదలైంది.

రామ్ నారాయణ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌, ఆకాంక్ష శర్మ జంటగా చేస్తున్న లైలా సినిమా అందమైన అమ్మాయిగా నటించబోతున్నాడు. అమ్మాయి వేషంలో ఉన్న పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 17న టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 

ర్యాపో వర్కింగ్ టైటిల్‌తో రామ్ పోతినేని సినిమా పోస్టర్, పృధ్వీ హీరోగా చేస్తున్న చౌకీదార్ సినిమా పోస్టర్, దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బాల నటిగా నటించిన ‘గాంధీ తాత  చెట్టు’ తదితర సినిమాల పోస్టర్స్ నేడు విడుదలయ్యాయి.