ఓ బుజ్జి తల్లీ నీ కోసం... నాగ చైతన్య

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘తండేల్’ సినిమా నుంచి ఓ బుజ్జి తల్లీ నీ కోసం అంటూ సాగే వీడియో సాంగ్‌కు విడుదలైంది. 

శ్రీమణి వ్రాసిన ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ చక్కగా స్వరపరచగా జావేద్ అలీ అద్భుతంగా చాలా ఆర్ద్రతతో పాడారు. ఈ పాట లిరిక్స్, సంగీతం ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పాటలో నాగ చైతన్య, సాయి పల్లవిల మద్య రొమాన్స్, విరహం అంత అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట చూస్తే ఈ సినిమాలో వారిద్దరి మద్య కెమిస్ట్రీ ఎంత గొప్పగా ఉందో అర్దమవుతుంది.

శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల యధార్ధ గాధ, ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తండెల్ సినిమాని నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.