
టాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేసే నటులలో శర్వానంద్ ఒకరు. అభిలాష్ కంకర దర్శకత్వంలో తన 36వ సినిమా మొదలుపట్టేశారు. అది చేస్తుండగానే 37వ సినిమాని లైన్లో పెట్టేశారు. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బారాజు దర్శకత్వంలో ఈ సినిమాకు చేయబోతున్నారు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా మాళవిక నాయర్ నటించబోతోంది.
ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అజయ్ సుంకర, కిషోర్ గరికపాటి కలిసి నిర్మించబోతున్నారు.
ఈ సినిమాకు ‘నారీ నారీ నడుమ మురారి’ అని టైటిల్ ఖరారు చేసిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున బాలకృష్ణ, రామ్ చరణ్ తమ సినిమా టైటిల్, ఫస్ట్-లుక్ విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రకటన వెలువడింది.
Bringing double the power and double the excitement 💥🔥
— Shreyas Sriniwaas (@shreyasmedia) January 12, 2025
Global Lion #Balakrishna garu & Global Star @AlwaysRamCharan garu to launch the #Sharwa37 Title & First look on JAN 14th 😍
This Sankranthi, the excitement levels soar higher ✨ pic.twitter.com/Z4qUXXwJ5j