
వెంకటేష్ మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల కాబోతోంది. నిన్న ట్రైలర్ విడుదలైంది. సంక్రాంతి పండుగనాడు వెంకటేష్ మార్క్ కామెడీ, యాక్షన్‌తో చక్కటి వినోదాత్మకమైన సినిమాకి ట్రైలర్ గ్యారెంటీ ఇస్తున్నట్లే ఉంది. సినిమాకి ముందు టీజర్, ‘పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్ చాలా కామన్..’ ‘వీడు ఫ్యామిలీతో ఎప్పుడు వచ్చినా విక్టరీయే..’ వంటి డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో వెంకటేష్, మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్లుగా చేశారు. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటించారు. వారి ముగ్గురు మద్య జరిగే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపధ్యంలో వారు ముగ్గురూ కలిసి ఓ కేసు దర్యాప్తుకి బయలుదేరి యాక్షన్ సీన్లో పాల్గొంటే ఎలా ఉంటుందో ట్రైలర్లో అనిల్ రావిపూడి రుచి చూపించారు.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, పృధ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, ఆనంద్ రాజ్, సాయి శ్రీనివాస్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్ర, చిట్టి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, కొరియోగ్రఫీ: భాను మాష్టర్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: రియల్ సతీష్ చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని నిర్మించారు.