మొన్న రాజమండ్రిలో చాలా అట్టహాసంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సుమారు లక్షన్నరకు పైగా అభిమానులు తరలివచ్చారు. డెప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చి ప్రసంగించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా పోలీస్ బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేయడంతో చాలా ప్రశాంతంగా, పండగ వాతావరణంలో పూర్తయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత సినీ ప్రముఖులు వెళ్ళిపోయిన అల్లరి మూకలు చెలరేగిపోయాయి.
అభిమానులు చూసేందుకు ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తిరగదోసి ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు రిమాండ్‌కి పంపించారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
కొందరు దుండగులు ఎల్ఈడీ స్క్రీన్లను తిరగదోస్తుంటే చుట్టూ ఉన్న యువకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించడం చాలా బాధాకరం. తమ మొబైల్ ఫోన్లతో ఆ విధ్వంసాన్ని చిత్రీకరించారు కూడా.
పోలీసులు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటి ఆధారంగా మారికొందరిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలే వారిని పట్టిచ్చాయి. అవే వారిని అరెస్ట్ చేసేందుకు సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి.
పుష్ప-2 సూపర్ హిట్ అవడం, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వివాదలలో చిక్కుకోవడం, ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలవుతుండటంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మద్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విధ్వంసానికి బహుశః అదే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజమండ్రిలో జరిగిన 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ అనంతరం కొందరు ఆకతాయిలు ఇలా పబ్లిక్ వీక్షణ కోసం పెట్టిన LED స్క్రీన్ ను ధ్వంసం చేశారు.పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారని సమాచారం.
(For More Updates Download The App Now-https://t.co/iPdcphBI9M) pic.twitter.com/5bTYDt7WDk
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025