
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘తండేల్’ సినిమా నుంచి నమో నమః శివాయ.. అంటూ శివుడిని ప్రార్ధిస్తూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. జొన్నవిత్తుల వ్రాసిన ఈ పాటని దేవీశ్రీ ప్రసాద్ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి, హరిప్రియ బృందం చాలా ఉత్తేజంగా పాడారు. ఈ పాటకు నాగ చైతన్య, సాయి పల్లవి బృందం డాన్స్ కూడా చాలా ఉత్తేజంగా సాగింది
చందూ మొండేటి దర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల యధార్ధ గాధ, ఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు.
ఈ సినిమాకి కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.