అమెరికాలో డాకూ మహరాజ్ ట్రైలర్

బాబీ కొల్లి దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ చిత్రం ‘డాకూ మహరాజ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమెరికాలో డల్లాస్ నగరంలో నిర్వహించబోతున్నారు. దీనిలో పాల్గొనేందుకు బాలయ్య ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. భారతీయ కాలమాన ప్రకారం జనవరి 5 వ తేదీ ఉదయం 8.39 గంటలకు డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. 

పోలీసులు అనుమతిస్తే జనవరి 7న హైదరాబాద్‌లో కూడా ఈ వేడుక నిర్వహించే అవకాశం ఉంది.  జనవరి 9న  అనంతపురంలో మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. దీనిని బట్టి డాకూ మహరాజ్ సినిమాపై దర్శక నిర్మాతలు, బాలయ్య అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.   

ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర చేస్తున్నారు. సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య,  తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఊర్వశీ రౌతేలాతో బాలయ్య కలిసి చేసిన ‘దబిడి దిబిడీ సాంగ్‌’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు.   

ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న డాకూ మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.