విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితోనే

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాది వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. విశ్వంభరని సంక్రాంతి బరిలో దింపుదామనుకున్నారు కానీ రామ్ చరణ్‌ కోసం గేమ్ చేంజ్‌ చేసి ఏప్రిల్‌ లేదా మే నెలలో రాబోతున్నారు. 

దీని తర్వాత సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటన వెలువడింది. ఈ సినిమాని నాచురల్ స్టార్ నానికి చెందిన యూనినిమాస్ మూవీస్ సమర్పణలో తీయబోతున్నారు. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల రక్తం కారుతున్న చేతులను కలిపి ఉన్న ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నారు. 

అయితే ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పూర్తిచేసి ఖాళీ అవుతున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం చిరంజీవితోనే అని ఇటీవలే చెప్పారు. కనుక ఓదెల కంటే ముందే అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా మొదలుపెట్టవచ్చని తాజా సమాచారం. ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టినా దీనిని సాహు గారపాటి నిర్మించనున్నారు.