
సాయి రాజేష్ దర్శకత్వం, స్క్రీన్ ప్లేలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు చేసిన ‘బేబీ’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చిన్న చిత్రమే అయినా సుమారు వంద కోట్లు కలెక్షన్స్ సాధించింది.
కనుక వారి కాంబినేషన్లోనే మరోసారి సాయి రాజేష్ అందించిన కధతో రవి నంబూద్రి దర్శకత్వంలో 2023 లో ఓ సినిమా మొదలుపెట్టారు. కానీ వివిద కారణాల చేత షూటింగ్ మొదలవకపోవడంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఇద్దరూ ఒకేసారి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ఆనంద్ దేవరకొండకు ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ వంటి హిట్ అందించిన దర్శకుడు వినోద్ అనంతోజు ఈ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ నుంచి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ఇద్దరూ తప్పుకోవడంతో ఆనంద్ దేవరకొండ స్థానంలో కిరణ్ అబ్బవరం హీరోగా సినిమా మొదలుపెట్టాలని సాయి రాజేష్, రవి నంబూద్రి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.