నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్

వెంకటేష్ మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగనాడే విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది కనుక ప్రమోషన్స్ కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ నెల 6న నిజామాబాద్‌లో ఖలీల్‌వాడీ వద్ద కలెక్టర్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ జరుగబోతోంది.  

అనిల రావిపూడి దర్శకత్వంలో ముక్కోణపు క్రైమ్ ధ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసరుగా చేశారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, పృధ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, విటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, ఆనంద్ రాజ్, సాయి శ్రీనివాస్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్ర, చిట్టి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, కొరియోగ్రఫీ: భాను మాష్టర్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: రియల్ సతీష్ చేశారు. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ సినిమాని నిర్మించారు.