నారీ నారీ నడుమ మురారీగా శర్వానంద్‌?

శర్వానంద్‌ ప్రస్తుతం అభిలాష్ కంకర దర్శకత్వంలో 36వ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తికాక ముందే మరో సినిమాని లైన్లో పెట్టేశారు. అదీ.. బాలయ్య బాబు సూపర్ హిట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌తో! 

సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బారాజు ఈ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నారు. అయితే ఈ విషయం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఇది బయటకు వచ్చేసింది కనుక నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది. 

శర్వానంద్‌-అభిలాష్ కంకర కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో శర్వా ‘బైక్ రేసర్‌’ పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా మాళవిక నాయర్ నటించబోతోంది. 

ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటింగ్: అనిల్ కుమార్‌ పి, ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వమ్, బ్యానర్ యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. శర్వానంద్‌ 37 వ సినిమా గురించి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.