దబిడి దిబిడి …. బాలయ్య వాయించేశాడుగా!

డాకూ మహరాజ్ నుంచి ‘దబిడి దిబిడి’ మూడో పాట వచ్చేసింది. ఈ పాటలో ఊర్వశీ రౌతేలా రెచ్చిపోయి డాన్స్ చేస్తే బాలయ్య ఆమెకు పోటీగా డాన్స్ చేసి మెప్పించారు. పాట  విడుదలైన రెండు గంటల్లోనే సుమారు 4,40 లక్షల వ్యూస్ వచ్చాయంటే అర్దం చేసుకోవచ్చు. కానీ పాటలో బాలయ్య ఆమె పిరుదులపై కొడుతున్న సన్నివేశం చాలా ఎబ్బెట్టుగా ఉంది. తమన్ మ్యూజిక్ రొటీన్‌గా ఉంది.           

డాకూ మహరాజ్ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాబీ డియోల్, సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు.   

ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న డాకూ మహారాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/ARGbxFY9McA?si=saWVFmVO3teYcCQd" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>