
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ అభిమానుల సహనాన్ని చాలా పరీక్షించినా, గురువారం సాయంత్రం విడుదల చేసిన ట్రైలర్ వారందరూ సంతోషంతో ఉప్పొంగిపోయేలా ఉంది.
ఓ సాధారణ గ్రామీణ యువకుడు, ఐఏఎస్ అధికారిగా, పోలీస్ ఆఫీసరుగా, జిల్లా కలెక్టర్‌గా విభిన్న గెటప్స్ లో రామ్ చరణ్‌ని చూడటం నిజంగా అభిమానులకు నిజంగా పండగే. ఈ సినిమాలో ఎస్‌జె.సూర్య దుర్మార్గుడైన ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు ట్రైలర్లో బయటపెట్టేశారు.
కనుక అతనిని, అతని నియంత్రణలో అన్ని వ్యవస్థలని మన హీరో ఏవిదంగా ఏరి పారేసి గేమ్ చేంజర్ అయ్యాడో ట్రైలర్లో చూపించారు. భారతీయుడు-2 సినిమా ఫ్లాప్ అవడంతో దర్శకుడు శంకర్ ఈ సినిమాని ఏవిదంగా తీస్తున్నాడో అని అభిమానులు సైతం భయపడ్డారు. కానీ వారి అంచనాలకు మించే గేమ్ చేంజర్ ఉండబోతోందని ట్రైలర్ స్పష్టం చేసింది కనుక జనవరి 10న సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.
రామ్ చరణ్, కియరా అద్వానీ, అంజలి, ఎస్‌జె.సూర్య ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించిన గేమ్ ఛేంజర్ జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.