
నందమూరి బాలకృష్ణ 109వ సినిమా ‘డాకూ మహరాజ్’ సంక్రాంతి పండుగకి అంటే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. డాకూ మహరాజ్ సినిమా నుంచి ‘దిబిడి దిబిడ’అంటూ సాగే మూడో పాటని గురువారం సాయంత్రం 5.16 గంటలకు విడుదల చేయబోతున్నట్లు సీతారా ఎంటర్టైన్మెంట్స్ నేడు ప్రకటించింది.
మొదట ఈ పాటని అమెరికాలో జనవరి 4న, భారత్లో 5న విడుదల చేద్దామనుకున్నారు. కానీ రెండు రోజుల ముందే విడుదల చేస్తున్నారు.
డాకూ మహరాజ్ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాబీ డియోల్, సచిన్ ఖేడెకర్, హిమజ, హర్ష వర్ధన్, చాందినీ చౌదరీ, రీషమా నానయ్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఊర్వశీ రౌతేలా బాలయ్య బాబుతో కలిసి దిబిడీ దిబిడీ అంటూ స్పెషల్ సాంగ్ చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్: వి వెంకట్ చేశారు.
ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.