ఎస్ఎస్ఎంబీ29: విజయవాడలో రెండు రోజులు షూటింగ్‌?


ఈరోజు హైదరాబాద్‌లో రాజమౌళి-మహేష్ బాబు సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఊహించిన్నట్లే ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను, సినీ ప్రముఖులను ఎవరినీ ఆహ్వానించలేదు. రాజమౌళి దంపతులు, మహేష్ బాబు దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి మరికొందరు యూనిట్ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు నెలల తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నప్పటికీ, పురోహితుల సూచన మేరకు ద్వితీయవిగ్నం లేకుండా ఉండేందుకు శుక్ర, శనివారం రెండు రోజులు విజయవాడ సమీపంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఇప్పటికే సెట్స్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి దాదాపు ఏడాదిగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ చివరికి ఇవాళ్ళ సినిమా షూటింగ్‌ లాంఛనంగా మొదలవడంతో మహేష్ బాబు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. రేపు విజయవాడలో షూటింగ్‌ చూసే అవకాశం వారికి లేకపోయినప్పటికీ అప్పుడే షూటింగ్‌ కూడా మొదలవుతున్నందుకు సంతోషమే కదా?