
రామ్ పోతినేని భాగ్యశ్రీ బోరే హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రాపో22’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మహాలక్ష్మి మన సాగర్ గాడి లవ్వు.. ‘ అంటూ హీరో హీరోయిన్ల పోస్టర్ విడుదల చేశారు.
సినిమా పూజా కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఓ యువకుడు సైకిల్ పట్టుకొని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ ఆవరణలోకి ప్రవేశిస్తున్నట్లు దానిలో చూపారు. ఆ థియేటర్ ఆవరణలో బాలయ్య కటౌట్ ఉంది. ఈ రెంటితో ఇదో పీరియాడికల్ మూవీ అని దర్శకుడు హింట్ ఇచ్చారు.
పి మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకి పాటలు: రామ్ మిరియాల, కార్తీక్, సంగీతం: వివేక్, మెర్విన్ చేస్తున్నారు.
On this special day, meet @bhagyasriiborse as Mahalaxmi... మన సాగర్ గాడి లవ్వు..
Team #RAPO22 wishes you all a very Happy New Year @ramsayz @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon #RAPO #NTVENT pic.twitter.com/onRFbPhbNL