
శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న హిట్-3 సినిమా షూటింగ్లో విషాదం సంభవించింది. శ్రీనగర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా కే.ఆర్ కృష్ణ అనే మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గుండెపోటుటో సెట్స్‌లో కుప్పకూలిపోయారు.
యూనిట్ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్ళినప్పటికీ అప్పటికే ఆమె మరణించారని వైద్యులు చెప్పారు. అంతవరకు అందరితో సరదాగా కబుర్లు చెపుతూ చలాకీగా పనిచేసుకుపోతున్న ఆమె హటాత్తుగా మరణించరంటే మొదట ఎవరూ నమ్మలేకపోయారు. ఆమె ఆకస్మిక మరణంతో సెట్స్‌లో అందరూ షాక్ అయ్యారు. విమానంలో ఆమె మృత దేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్‌లో భాగంగా ఈ మూడో హిట్ తెరకెక్కిస్తున్నారు. దీనిలో శ్రీనిధి శెట్టి నానికి జోడీగా నటిస్తోంది.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంత్ తీపిర్నేని దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన విడుదలకాబోతోంది.