
విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ జంటగా నటించిన దిల్రుబా సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవడంతో వెంటనే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ముందుగా ఈ నెల 3న దిల్రుబా టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ విషయం తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా నాచురల్‌గా బాగుంది. వైజాగ్ బీచ్ ఒడ్డున హీరో హీరోయిన్లు సైకిల్స్‌పై కబుర్లు చెప్పుకుంటూ జాలీగా తిరుగుతున్నట్లు పోస్టర్ వేశారు.
ఈ నెలాఖరులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున దిల్రుబాతో ప్రేక్షకుల ముందుకు వచ్చచేసేందుకు కిరణ్ అబ్బవరం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
‘దిల్రుబా’కి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్ , సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు.
శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు.
Gear up for the magical journey of #Dilruba 🌊❤️, where romance meets the winds of change.
— Kakinada Talkies (@Kkdtalkies) January 1, 2025
Teaser drops on Jan 3rd#KA10 @Kiran_Abbavaram pic.twitter.com/vM1c3Gao7y