సిఎం రేవంత్ హెచ్చరిక అప్పుడే పని చేసిందే!

ఇటీవల తెలుగు సినీ ప్రముఖులు భేటీలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులతో ఆడియో, వీడియోలు రూపొందించి ఇవ్వాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఇదివరకు సిఎం రేవంత్ రెడ్డి రెండు మూడుసార్లు దీని కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ సినీ పరిశ్రమ పట్టించుకోలేదు. కానీ మొన్న సమావేశంలో గట్టిగా చెప్పగానే మొట్టమొదట ప్రభాస్‌ స్పందిస్తూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ ఓ వీడియో సందేశం తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“జీవితంలో మనకు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఉన్నాయి. మనల్ని  ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మనవాళ్లు ఉన్నప్పుడు మనకీ డ్రగ్స్ అవసరమా డార్లింగ్? సే నో టు డ్రగ్స్.. మాదక ద్రవ్యాలు కట్టడిలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించండి,” అని దానిలో ప్రభాస్‌ విజ్ఞప్తి చేశారు.

Rebel Star #Prabhas's message supporting the anti-drug awareness initiative.

Together, let's build a healthier and stronger society.#SayNoToDrugs @TelanganaCMO @revanth_anumula @TelanganaDGP @tg_anb @director_tganb @hydcitypolice @narcoticsbureau #ShreyasMedia pic.twitter.com/cBaLqWDlYf
— Shreyas Media (@shreyasgroup) December 31, 2024