సంబంధిత వార్తలు

విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా ‘లైలా’ సినిమా నుంచి సోనూ మోడల్ పాట విడుదలైంది. దీనిని విశ్వక్ సేన్ స్వయంగా వ్రాయగాలియాన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. నారాయణన్ రవిశంకర్, రేష్మ శ్యామ్ ఆలపించిన ఈ పాటకు విశ్వక్ సేన్ బృందం హుషారుగా డాన్స్ చేసింది. లైలాలో విశ్వక్ సేన్ హీరోగా, ఓ ఆడపిల్లగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఈ సినిమాకు దర్శకత్వం: రామ్ నారాయణ, సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 2025, ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున లైలా విడుదల కాబోతోంది.