
కింగ్ నాగార్జున వల్ల తన కెరియర్ అస్థవ్యస్థం అయ్యిందని హాట్ కామెంట్స్ చేస్తున్నాడు మ్యూజిక్ డైరక్టర్ కళ్యాణ రమణి. కీరవాణి తమ్ముడే అయినా ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. కెరియర్ మొదట్లో కాస్త ఊపందుకున్నా నాగ్ తో బాస్ సినిమా చేశాక కాస్త ఇబ్బంది పడ్డాడట. అంతేకాదు బాస్ తర్వాత నాగార్జున సినిమాకు మ్యూజిక్ ఛాన్స్ వచ్చినా డైరక్టర్ తన ట్యూన్స్ ఎంతకి నచ్చకపోవడంతో ఆ సినిమా నుండి బయటకు రావాల్సి వచ్చిందని ఇక అప్పటి నుండి అవకాశాల్లేకుండా పోయాయని అంటున్నాడు కళ్యాణ రమణి.
మెలోడీ మ్యూజిక్ అందించే ఈయన ఇప్పుడు కాస్త ఫాంలోకి వచ్చాడు. అవసరలా శ్రీనివాస్, నందిని రెడ్డి లాంటి టాలెంటెడ్ డైరక్టర్స్ సినిమాలకు కళ్యాణ రమణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక కెరియర్ ప్రస్తుతం సాటిస్ఫైడ్ గా ఉన్నా నాగ్ సినిమా అవకాశం కోల్పోవడం వల్లే తన కెరియర్ మునిగిపోయిందని.. ఇక మీదట అలాంటి తప్పు జరుగకుండా జాగ్రత్త పడతానని అంటున్నాడు కళ్యాణ రమణి.
టాలెంట్ ఎక్కడ ఉంటే వారిని వెతికి మరి అవకాశాలిస్తాడు నాగార్జున. అలాంటి నాగ్ సినిమా వల్ల తనకు అవకాశాలు లేకుండా పోయాయని చెప్పడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.