
ఆదివారం సాయంత్రం విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటవుట్‌ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో అభిమానలను ఉద్దేశించి మాట్లాడుతూ, “గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రస్తుతం నా మొబైల్ ఫోన్లో రెడీగా ఉంది. ఇప్పుడు ట్రైలర్ అంటే ఆషామాషీగా ఉంటే సరిపోదు. ట్రైలరే సినిమా భవిష్యత్‌ని నిర్ణయిస్తోంది. కనుక అదిరిపోయేలా మీ అందరికీ నచ్చేలా చేసేందుకు మేమందరం దానిపై మరికొంత వర్క్ చేయాల్సి ఉంది. కొత్త సంవత్సరంలో ట్రైలర్ విడుదల చేసుకుందాము.
విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకి పుట్టిల్లు వంటిది. కనుక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే నిర్వహించుకుందామా లేదా మరెక్కడైనా నిర్వహించుకుందామా? అని ఆలోచిస్తున్నాము. ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకుంటే ఎలా ఉంటుంది? ఇవాళ్ళ ఆయనని కలిసి దీని గురించి మాట్లాడుతాను. ఆయన ఎప్పుడు టైమ్ కేటాయిస్తే అప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుందాము,” అని దిల్‌రాజు అన్నారు.
అంటే గేమ్ చేంజర్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండూ జనవరి మొదటివారం విజయవాడలో ఇప్పుడు రామ్ చరణ్ కటవుట్ పెట్టిన వజ్రా మైదానంలోనే జరిగే అవకాశం ఉందని భావించవచ్చు.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందాం
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2024
పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్‌ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడూ, ఎక్కడా అనేది నిర్ణయిస్తాం - దిల్ రాజు pic.twitter.com/OBO7je1QoC