చంటబ్బాయ్ వస్తాడట.. కానీ ఇప్పుడే కాదు!

సినీ పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వెంకటేష్ నలుగురూ సీనియర్ నటులు. వారిలో చిరంజీవి వారసుడు రామ్ చరణ్‌ హీరోగా దూసుకుపోతున్నారు. నాగార్జున ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ దూసకుపోకపోయినా ఇండస్ట్రీలో బలంగా నిలబడున్నారు.

బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని ప్రశాంత్ ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నారు. మరి వెంకటేష్ ఎప్పుడు తన వారసుడుని పరిచయం చేస్తారు? అసలు అతను సినీ పరిశ్రమలోకి వస్తాడా లేడా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ‘ఆన్‌ స్టాపబుల్’ గేమ్ షోలో వెంకటేష్ పాల్గొన్నప్పుడు అభిమానుల తరపున బాలయ్యే ఈ ప్రశ్న అడిగేశారు.

దానికి వెంకటేష్ సమాధానం చెపుతూ, “మా వాడికి సినీ పరిశ్రమకి సంబందించి టాలెంట్ ఉంది. వాడికీ సినీ పరిశ్రమపై ఆసక్తి ఉంది. కానీ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. దానిపైనే దృష్టి ఉంది. ఒకవేళ వాడు రావలనుకుంటే తప్పకుండా వస్తాడు,” అని చెప్పారు.  

వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెలు. వారి తర్వాత  అర్జున్ పుట్టినందున అతనికి ఇంకా 20 ఏళ్ళ  వయసే. కనుక సినీ వారసుల పోటీలో కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది.