
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా భారీ అంచనాలతో జనవరి 10న రామ్ చరణ్-శంకర్ల సినిమా గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ‘రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం’ ఆధ్వర్యంలో విజయవాడలో బృందావనం కాలనీలో వజ్రా మైదానంలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటవుట్ ఏర్పాటు చేశారు.
గేమ్ చేంజర్ సంక్రాంతి పండుగకు వస్తున్నందున సూటుబూటుతో స్టయిల్‌గా కనిపించే రామ్ చరణ్ బదులు, గళ్ళ లుంగీ, నల్ల బనీనుతో పల్లెటూరి యువకుడు రూపంలో కటవుట్ ఏర్పాటు చేశారు.
టిఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఈరోజు మద్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మద్యాహ్నం 3 గంటలకు వజ్రామైదానం చేరుకొని కటవుట్ ఆవిష్కరిస్తారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
దేశంలో ఓ హీరోకి ఇంత పెద్ద కటవుట్ పెట్టడం ఇదే తొలిసారి. కనుక వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా వచ్చి ఈ రికార్డు నమోదు చేసుకోబోతున్నారు.