
సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ డైరక్షన్లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా రోబో 2.0. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఖర్చే 40 కోట్ల దాకా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నెల 20న రిలీజ్ చేయబోతున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఖర్చే 6 కోట్ల దాకా అవుతుందని అంటున్నారు. విజ్ క్రాఫ్ట్ ఈవెంట్ మేనేజ్ మెంట్ వారు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారట. కరణ్ జోహార్ సమక్షంలో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ నడుస్తుంది.
రోబోని మించి ఈ సినిమా ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు. కబాలితో హిట్ అందుకున్న రజిని రోబోగా అదరగొట్టడం ఖాయమంటున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండేలా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే ఆ రేంజ్ చూపిస్తున్నారు. 340 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దుతున్నారట.
ఐ తర్వాత శంకర్ తీస్తున్న సినిమా కాబట్టి శంకర్ సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అని తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.