మహేష్-రాజమౌళి సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌?

మహేష్ బాబు-రాజమౌళి సినిమా వివరాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి టీమ్‌ మాత్రం ఈ సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో అందరూ చాలా బిజీగా ఉన్నందునే అప్‌డేట్‌ ఇవ్వలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయినా అభిమానులు ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సోషల్ మీడియాలో వెతుకుతూనే ఉన్నారు. 

ఈ ఏడాది రాజమౌళి మూడు నాలుగుసార్లు ముంబయి వచ్చి బాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంకా చోప్రాని కలిసి మాట్లాడి వెళ్ళారని బాలీవుడ్‌ మీడియాలో వచ్చిన ఓ వార్త అభిమానుల ఆలోచనలకు పదును పెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కూడా చాలా కీలకం కనుక బాలీవుడ్‌లో సీనియర్ నటి ప్రియాంకా చోప్రాని మహేష్ బాబుకి జోడీగా తీసుకోవాలణే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ముంబయి వెళ్ళి ఆమెను కలిసి ఉండవచ్చని, రాజమౌళి స్వయంగా వచ్చి ఆఫర్ ఇస్తే ఆమె కాదనలేరు కనుక వెంటనే అంగీకరించారని ఊహాగానాలు మొదలైపోయాయి. 

ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించబోతోందని అ మద్య వార్తలు వచ్చాయి. కానీ వీటిని రాజమౌళి లేదా ఆయన టీమ్‌లో ఎవరో ఒకరు ధృవీకరిస్తే తప్ప వీటిని నమ్మలేము. కనుక అంతవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. 

ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎప్పటిలాగే రాజమౌళి కుటుంబ సభ్యులు కీరవాణి తదితరులే ఈ సినిమాకి కూడా పనిచేస్తారు కనుక నటీనటులు, విదేశీ సాంకేతిక నిపుణులు ఎవరో తెలిస్తే సరిపోతుంది.