సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!

హీరోయిన్ గా క్రేజ్ సంపాదించినప్పటి నుండి ఇద్దరు ముగ్గురితో ప్రేమలో పడి నానా హడావిడి చేసిన నయనతార ప్రస్తుతం డైరక్టర్ విఘ్నేష్ శివన్ లవ్ లో ఉంది. అవార్డ్ ఫంక్షన్ ఎక్కడ జరిగితే అక్కడ నయన్ పక్కనే విఘ్నేష్ కనిపిస్తున్నాడు. ముదిరి పాకాన పడ్డ వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇంతలో షాకింగ్ న్యూస్ ఏంటంటే నయనతార, విఘ్నేష్ లు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారట.  

ఈ విషయం ఎవరికి తెలియకుండా దాస్తున్నారని కోలీవుడ్ మీడియా రచ్చ రచ్చ చేస్తుంది. బాబు బంగారం అప్పుడు ఫారిన్ షూటింగ్ లో నయనతార గురించి వచ్చిన పెళ్లి రూమర్స్ అన్ని నిజమే అన్నమాట. మొత్తానికి నయన్ ఓ ఇంటిదయ్యింది. అయితే హీరోయిన్ గా మరిన్ని హిట్స్ తో ఫాంలో ఉంది ఈ అమ్మడు. రీసెంట్ గా వచ్చిన కాష్మోరా కూడా హిట్ అవడంతో కోలీవుడ్ లో నయనతార అదిరిపోయే రేంజ్లో ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

మరి సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం వల్ల తనకు ఎలా ఉందో కాని ఆమె పెళ్లి వార్త విని ఫ్యాన్స్ అయితే షాక్ తింటున్నారు. ఇక ఈ విషయంపై అధికారికంగా అసలు ఇది నిజమా కాదా అన్నది బయట పడాల్సి ఉంది.