
యువ నటులకు ఇంకా ‘స్టార్ ఇమేజ్ చట్రం’లో ఇంకా బందీలుగా మారలేదు కనుక అందరూ విలక్షణమైన కధలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. వారిలో సుహాస్ కూడా ఒకరు. ‘జనక అయితే గనక’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న సుహాస్, రామ్ గోదాల దర్శకత్వంలో ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా ప్రారంభించాడు. మొన్న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింమ్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలో మలయాళ నటి మాళవిక మనోజ్, సుహాస్‌కు జోడీగా నటిస్తోంది. ఇంకా అనిత హంస నందిని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృధ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రాఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: మణికందన్, ఆర్ట్: బ్రహ్మ కడలి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ నల్లా, ప్రదీప్ తాళ్ళు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/2UukOq0lyxQ?si=nPki1rsybtp0Rm8j" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>