
ఈరోజు సిఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం తర్వాత వారి ధోరణిలో వెంటనే మార్పు కనపడింది. మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, మంచు విష్ణు ఇంకా పలువురు సినీ ప్రముఖులు పోటా పోటీగా సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలతో ఈరోజు చాలా సానుకూల వాతావరణంలో చక్కటి సమావేశం జరిగిందని ట్వీట్స్ వేస్తున్నారు.
సినీ పరిశ్రమకు అండగా నిలబడతామని హామీ ఇచ్చినందుకు సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి అందరం తప్పకుండా కృషి చేస్తామని, సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి చాలా అమూల్యమైన సూచనలు చేశారంటూ ట్వీట్స్ వేస్తున్నారు.
ప్రభుత్వాల అండదండలు, ప్రోత్సాహంతోనే సినీ పరిశ్రమ ఇంతగా ఎదిగిందని, తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలతో ఇక ముందు మరింత ఎదుగుతుందని ఆశిస్తున్నామని పోటాపోటీగా ట్వీట్స్ వేస్తున్నారు.
అంటే సిఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు ఏమైనా హామీలు ఇచ్చారో లేదో కానీ పద్దతిగా నడుచుకోవాలని ఖరాఖండీగా సూచించారు. ఓకే ఒక్క సమావేశంతో టాలీవుడ్‌ని సిఎం రేవంత్ రెడ్డి గాడిలో పెట్టిన్నట్లే భావించవచ్చు.