
నవీన్ పోలిశెట్టి, మృణాళిని టాకూర్ జంటగా ‘అనగనగా ఒక రాజు,’ సినిమా 2025 లో వచ్చేస్తోంది. నిన్ననే ఈ సినిమాలో రాజావారి పెళ్ళి సందడి ఎలా ఉంటుందో చమ్మక్ చంద్ర చిన్న శాంపిల్ చూపారు. ఇవాళ్ళ పూర్తిగా రుచి చూపించారు. ముఖేష్ అంబానీని మావయ్యా అంటూ మన రాజావారు (నవీన్ పోలిశెట్టి) పలకరించి చెప్పిన కబుర్లు వింటే ఎవరూ నవ్వాపుకోలేరు. దాని గురించి వివరించడం కంటే స్వయంగా చూస్తేనే రాజావారి పెళ్ళి ఏ రేంజ్‌లో జరుగుతోందో చూసి ఆనందించవచ్చు.
మర్రి దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిపి ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: జె. యువరాజ్ చేస్తున్నారు.