సిఎం రేవంత్ రెడ్డికి విజయశాంతి సూచన

ఈరోజు ఉదయం 10.30 గంటలకు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సిఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఇటు సినీ పరిశ్రమలో అటు రాజకీయాలలో చిరకాలం పనిచేసిన విజయశాంతి సిఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా కొన్ని సూచనలు చేశారు.

ఈ భేటీలో మళ్ళీ టికెట్స్ రేట్స్ పెంచుకుని సంక్రాంతికి స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతించాలని సినీ ప్రముఖులు తప్పకుండా కోరుతారు. కనుక ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ తమ నిర్ణయం మార్చుకోవద్దని విజయశాంతి విజ్ఞప్తి చేశారు.

అంతేకాక తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు, రాష్ట్రానికి చెందిన చిన్న స్థాయి కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం, చిన్న మధ్య తరగతి భారీ బడ్జెట్‌ సినిమాలకు థియేటర్ల కేటాయింపు తదితర అంశాలపై సమగ్రమైన చర్చ జరపాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే..     

  <blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రిగార్లను గురువారం నాడు కలుస్తున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చలు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రిగారు విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక,… <a href="https://t.co/uN5sG42hQr">pic.twitter.com/uN5sG42hQr</a></p>&mdash; VIJAYASHANTHI (@vijayashanthi_m) <a href="https://twitter.com/vijayashanthi_m/status/1871958140368912429?ref_src=twsrc%5Etfw">December 25, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>