నేను నిందితుడిని మాత్రమే: జానీ మాస్టర్‌

ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు ఛార్జ్-షీట్‌ ఫైల్ చేశారు. దానిలో అతను తన బృందంలో ఓ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు పేర్కొన్నారు. కనుక మళ్ళీ ఆయన అరెస్ట్‌ తప్పకపోవచ్చు.

దీనిపై అతను స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. “ఈ కేసులో ఏం జరిగిందనేది నా మనసుకి, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. న్యాయస్థానంలో న్యాయం ఉంది కనుకనే నేను జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ నలుగురితో కలిసి నా సినిమా పనులు చేసుకోగలుగుతున్నాను.

ఇప్పుడు కూడా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. న్యాయస్థానంలో నేను నిర్ధోషిగా నిరూపించుకొని ఈ కేసు నుంచి బయటపడతాను. అంతవరకు నేను నిందితుడిని మాత్రమే. క్రిమినల్ కాదు,” అన్నారు. 

జానీ మాస్టర్‌ బృందంలో ముంబయికి చెందిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్‌ 15న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా, పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయన హైకోర్టుని ఆశ్రయించి బెయిల్‌ పొంది చంచల్‌గూడా జైలు నుంచి అక్టోబర్‌ 25న విడుదలయ్యారు. ఇప్పుడు పోలీసులు ఛార్జ్-షీట్‌లో అతను నేరం చేసిన్నట్లు పేర్కొనడంతో మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది.