
‘రాబిన్‌హుడ్’గా వస్తున్న నితిన్ నేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంటాక్లజ్ వేషంలో ఓ పోస్టర్ బహుమతిగా అందించారు. ఆనాటి రాబిన్‌హుడ్ కధలో హీరో డబ్బున్నవారిని దోచుకొని పేదలకు ఆ సొమ్ము పంచిపెట్టేవాడు. కానీ ఇవాళ్ళ క్రిస్మస్ పండుగ సందర్భంగా నితిన్, శ్రీలీల చిన్నారులకు బహుమతులు అందజేశారు.
ఈ సినిమాలో శ్రీలీలతో రాబిన్‌హుడ్ రొమాన్స్ చేయబోతున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీతో వినోదింపజేయబోతున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన ఫిబ్రవరి 25కి వాయిదా పడింది.