
ఈరోజు క్రిస్మస్ కానుకగా ‘లైలా’ నుంచి సోనూ మోడల్ పోస్టర్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ తొలిసారిగా ఈ సినిమాలో ఓ అందమైన అమ్మాయిగా నటించబోతున్నారు. మరోటి లవర్ బాయ్ పాత్ర. అదే ‘సోనూ మోడల్.’
రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ నటిస్తోంది. 2025, ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున ‘లైలా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కనుక జనవరి 1న ‘ఫస్ట్ రోజ్ ఫ్రమ్ లైలా’ విడుదల చేస్తామని విశ్వక్ సేన్ ట్వీట్ చేశారు.
ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.