ఫిబ్రవరిలో దిల్‌రుబాతో వస్తున్న కిరణ్

 ‘క’ సినిమాతో తాజాగా హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం అది చేస్తుండగానే విశ్వకరుణ్ దర్శకత్వంలో ‘దిల్‌రుబా’ అనే మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. “ప్రేమ చాలా గొప్పది. కానీ అది ఇచ్చే బాధ భయంకరంగా ఉంటుంది,” అనే కాప్షన్‌తో కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆకట్టుకుంది. సినిమా షూటింగ్‌ కూడా పూర్తయిందని తెలియజేస్తూ ఇటీవల మరో పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే టీజర్‌ విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు.      

ఈ చక్కటి, చిక్కటి రొమాంటిక్ సినిమాలో కిరణ్ అబ్బవరం ‘దిల్‌రుబా’గా రుక్సర్ ధిల్లాన్ నటిస్తోంది. జనవరి నెలాఖరులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసి ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

‘దిల్‌రుబా’కి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్ , సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.   

శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.