ఇంతకాలం మంచు కుటుంబంలో గొడవలతో రోడ్డున పడ్డ మంచు సోదరులకు రాచకొండ సీపీ సుధీర్ బాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేయడంతో, మంచు కుటుంబంలో మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ అరెస్టు, తదనంతర పరిణామాల వలన అందరి దృష్టి మంచు కుటుంబంపై నుంచి దానిపైకి మళ్ళడంతో వారికీ ఉపశమనం లభించిన్నట్లయింది.
కనుక మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కేసు వ్యవహారంపై స్పందిస్తూ, సినీ పరిశ్రమలో అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సృజనాత్మకమైన సినీ పరిశ్రమలో అందరూ ప్రభుత్వాలతో ఎల్లప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. కనుక సున్నితమైన అల్లు అర్జున్ కేసు విషయంలో ఎవరూ మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయలు, వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాననంటూ ఓ లేఖ విడుదల చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..