సలార్-1: నాకు తృప్తి కలిగించలేదు: ప్రశాంత్ నీల్‌

ప్రభాస్‌ సినీ కెరీర్‌లో ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ ఎప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు చాలా భిన్నమైన అనుభూతి ఇచ్చింది. అయితే ఆ సినిమాతో తాను సంతృప్తిగా లేనని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ చెప్పడం విశేషం. 

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “సలార్‌తో నేను అంత సంతృప్తిగా లేను. ఎందువల్ల అంటే దానిలో కాస్త కేజీఎఫ్ ఛాయలు కనిపించాయి. కానీ సలార్-2 మాత్రం మా ఇద్దరి కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిపోయేలా తీస్తాను. సలార్-2 ప్రేక్షకుల అంచనాలకు మించేలా తీస్తాను. నా జీవితంలో కొన్ని విషయాలపై పూర్తి నమ్మకంతో ఉంటాను. వాటిలో సలార్-2 ఒకటి,” అని ప్రశాంత్ నీల్‌ చెప్పారు. 

సలార్-2 సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. ప్రభాస్‌ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ పూర్తి చేస్తున్నారు. దాని తర్వాత చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రశాంత్ నీల్‌ కూడా జూ.ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రభాస్‌ ఫ్రీ అయ్యేలోగా ఆ సినిమాని పూర్తి చేస్తే అప్పుడు సలార్-2 మొదలుపెట్టగలుగుతారు. బహుశః 2026 ఏప్రిల్-జూన్ మద్య ఎప్పుడో సలార్-2 రెగ్యులర్ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.   

(Video Courtecy: Akashavani)