
శనివారం రాత్రి అల్లు అర్జున్ ప్రెస్మీట్ తర్వాత మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు అందరూ అల్లు అర్జున్ని తప్పు పడుతుండటంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం, అసహనంతో రగిలిపోతున్నారు. కనుక వారు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదే అదునుగా అల్లు అర్జున్ని మరింత దెబ్బ తీసేందుకు కొందరు అభిమానుల పేరుతో అనుచితమైన పోస్టులు పెడుతున్నారు.
ఇది అల్లు అర్జున్ దృష్టికి రావడంతో వెంటనే స్పందిస్తూ, “అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేవిదంగా పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ విదంగా నెగెటివ్ పోస్టులు పెడుతున్నవాటిపై స్పందించకుండా దూరంగా ఉండాలని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. అభిమానుల ముసుగులో నెగెటివ్ పోస్టులు పెడుతున్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ హెచ్చరించారు.