మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌

ఈరోజు శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి ఇదే అంశం ప్రస్తావన వచ్చినప్పుడు టాలీవుడ్‌ ప్రముఖులపై నిప్పులు చెరిగారు. ఇకపై ప్రివిలేజ్ షోలను అనుమతించబోమని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో శనివారం రాత్రి అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి వివరణ ఇచేందుకు సిద్దమయ్యారు.  మరి కొద్ది సేపటిలో అల్లు అర్జున్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. ఆయన ఏమి మాట్లాడుతారో? అన్ని ప్రధాన న్యూస్ చానల్స్ ఆయన ప్రెస్‌మీట్‌ని లైవ్ తెలీకాస్ట్ చేయనున్నాయి. ఈ ప్రెస్‌మీట్‌కు సంబందించి ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ టీవీ9 యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=SxylQUxVfYg