పుష్ప-2 ఓటీటీలోకి అప్పుడే కాదట!

డిసెంబర్‌ 5న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. కనుక జనవరి మొదటి వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోందని వార్తలు వచ్చేశాయి. ఈ వార్తలు పుష్ప-2 కలెక్షన్స్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది కనుక పుష్ప-2 టీమ్‌ వెంటనే స్పందిస్తూ, “పుష్ప-2 థియేటర్లలో విడుదలైన రోజు నుంచి 56 రోజుల వరకు ఓటీటీలో ప్రసారం కాదు. కనుక ఆలోగా పుష్ప-2ని థియేటర్లలోనే చూసి ఆనందించండి,” అని విజ్ఞప్తి చేసింది.

డిసెంబర్‌ 5 నుంచి 56 రోజులంటే జనవరి 30 నుంచి పుష్ప-2 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందన్న మాట! 

పుష్ప-2 డిసెంబర్‌ 5న విడుదలైనప్పటి నుంచి భారీగా కలెక్షన్స్‌ సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రెండు వారాలలోనే ప్రపంచవ్యాప్తంగారూ.1508 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ సాధించి రికార్డు సృష్టించింది. 

ఇప్పుడు క్రిస్మస్ పండుగ హడావుడి మొదలైంది. ఆ తర్వాత న్యూఇయర్ అది పూర్తయ్యేలోగా సంక్రాంతి పండుగ హడావుడి మొదలవుతుంది. అంటే రాబోయే 20-30 రోజులలో పుష్ప-2 మరింత కలెక్షన్స్‌ సాధించబోతోందన్న మాట. 

ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఓటీటీలో విడుదల చేయాలని ఎందుకు అనుకుంటారు?

 కనుక జనవరి నెలాఖరు వరకు పుష్ప-2 కోసం ఓటీటీ ప్రేక్షకులు ఓపికగా ఎదురు చూడాల్సిందే.       కానీ అంతవరకు ఓపిక పట్టలేనివారు పుష్ప-2 టీమ్‌ సూచించిన్నట్లు థియేటర్లలో చూసి ఆనందించవచ్చు.